రాఫెల్‌ వస్తే ఎయిర్‌ఫోర్స్‌కు బలం

BS dhanoa
BS dhanoa, iaf chief


న్యూఢిల్లీ: రాఫెల్‌ ఫైటర్‌ జెట్స్‌ మన చేతికి చిక్కితే ఇక ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు ఎదురులేదని, పాకిస్థాన్‌ కనీసం మన సరిహద్దు దగ్గరికి కూడా రాదని ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ చీఫ్‌ బిఎస్‌ ధనోవా అన్నారు. సోమవారం చినూక్‌ హెలికాప్టర్లను ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లోకి ప్రవేశపెట్టిన తర్వాత ఆయన మాట్లాడారు. రాఫెల్‌ అత్యాధునికి ఫైటర్‌ జెట్‌ అని, భారత ఉపఖండంలో అత్యుత్తమ జెట్‌గా నిలవనుందని అన్నారు. రాఫెల్‌ వచ్చిన తర్వాత ఎయిర్‌ఫోర్స్‌ బలం ఎన్నో రెట్లు పెరుగుతుంది. అప్పుడు పాకిస్థాన్‌ కనీసం నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు దగ్గరకు కూడా రాదని, జెట్స్‌ను సవాలు చేసే సామర్ధ్యం పాక్‌కు లేదని ధనోవా స్పష్టం చేశారు. రాఫెల్‌ మొదటి జెట్‌ సెప్టెంబరులో రానుంది. రాఫెల్‌లో ఎయిర్‌ టు ఎయిర్‌ మిస్సైల్స్‌ను లోడ్‌ చేయవచ్చు. ఇవి 150 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా విజయవంతంగా ఛేదించగలవు.