జులియన్‌వాలా బాగ్‌ను సందర్శించి బ్రిటన్‌ ఆర్చ్‌ బిషప్‌

Justin welby
Justin welby


అమృత్‌సర్‌: బ్రిటన్‌ కాంటర్‌బరీ ఆర్చ్‌బిషప్‌ జస్టిస్‌ వెల్బీ భారత్‌లోని జులియన్‌వాలా బాగ్‌ స్మారక స్థూపాన్ని సందర్శించారు. స్థూపానికి సాష్టాంగ నమస్కారం చేసి నివాళులు అర్పించారు. అక్కడికి వచ్చిన ప్రజలనుద్దేశించి నాటి ఘటనకు పాల్పడిన వారిని దేవుడు క్షమించాలని ప్రార్థనలు చేశారు. నాటి ఘటనకు కారణమే తమ దేశమైనందుకు సిగ్గుపడుతున్నానని వ్యాఖ్యానించారు. నాటి బ్రిటిష్‌ పాలకులు పాల్పడిన ఈ ఘాతుకానికి సంబంధించిన జ్ఞాపకాలు ఇంకా ఈ స్థూపం రూపంలో బతికేఉన్నాయన్నారు. ఈ నేరానికి పాల్పడిన వారి తరపున క్షమాపణలు కోరుతున్నానన్నారు. ఒక మతాధిపతిగా ఈ ఘటనను ఖండిస్తున్నానని ఆర్చ్‌ బిషప్‌ జస్టిస్‌ వెల్పీ అన్నారు. ఇక్కడ సిక్కులు, హిందువులు, క్రైస్తవులు, ముస్లింలను 1919లో బ్రిటిష్‌ బలగాలు ఊచకోత కోశాయని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. యూకె తరపున క్షమించాల్సింది కోరే అర్హత తనకు లేదని వ్యక్తిగతంగా క్షమించాల్సిందిగా కోరానని ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. జులియన్‌వాలాబాగ్‌ ఘటన జరిగిన 100 ఏళ్లు పూర్తయిన సమయంలో బ్రిటన్‌ మాజీ ప్రధాని థెరిసా మే కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/national/