ఢిల్లీ తెలంగాణ భవన్‌లో భోనాల వేడుకలు

bonalu
bonalu

న్యూఢిల్లీ: ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో బోనాల పండగ ఘనంగా నిర్వహించారుఈ వేడుకల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బోనాల పండగ తెలంగాణకే విశిష్ఠమైన వేడుక అన్నారు. వచ్చే ఏడాది కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బోనాల పండగ నిర్వహించేలా చూస్తాం. అమ్మవారి దయతో అందరూ సుఖసంతోషాలతో ఉండాలి. దేశ రక్షణ కోసం పని చేస్తున్న సైనికులు మరింత శక్తిమంతం కావాలి అని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల ఆటలు, డప్పు కళాకారుల నృత్యాలు అందర్నీ ఆకట్టుకున్నాయి.ఈ వేడుకల్లో ఢిల్లీ లోని తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రుడు, రెసిడెంట్‌ కమిషనర్‌ వేదాంతం గిరి, లాల్‌దర్వాజ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/