విజయ్‌ మాల్యా పిటిషన్‌ కొట్టివేత

Vijay Mallya
Vijay Mallya

ముంబయి: ఆర్థిక నేరగాడు విజయ్‌ మాల్యా తన ఆస్తుల జప్తులను నిలిపివేయాలని దాఖలు చేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు కొట్టివేసింది. గురువారం జస్టిస్‌ అఖిల్ ఖురేషి, జస్టిస్‌ ఎస్‌జే కథవాలాతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు చేస్తున్న ఆస్తుల జప్తుపై స్టే ఇవ్వాలని మాల్యా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అంతేగాక తనపై వేసిన ఖపారిపోయిన ఆర్థిక నేరగాడిగ ముద్రకు సంబంధించి చెల్లుబాటును సవాల్‌ చేస్తూ తాను దాఖలు చేసిన పిటిషన్‌ విచారణకు వచ్చే వరకు రక్షణ కల్పించాలని ఇదే పిటిషన్‌లో కోరారు. దీన్ని ధర్మాసనం కొట్టివేసింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/