సుప్రీం తీర్పు తర్వాతే బిజెపి అడుగులు

BJP
BJP


బెంగళూరు: కర్ణాటకలోని విధానసౌధలో గురువారం సాయంత్రం బిజెపి శాసనసభా పక్ష అత్యవసర సమావేశం యడ్యూరప్ప అధ్యక్షతన జరిగింది. సుప్రీం సూచన అనంతరం స్పీకర్‌ కార్యాలయంలో జరిగిన పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. తిరిగి శుక్రవారం ఉదయం సమావేశం కావాలని నిర్ణయించామని పార్టీ ప్రధాన కార్యదర్శి మీడియాకు వెల్లడించారు. సుప్రీం కోర్టులో అసమ్మతి ఎమ్మెల్యేల పిటిషన్‌పై శుక్రవారం వెలువడే తీర్పు అనంతరం తదుపరి వ్యూహాన్ని ఖరారు చేస్తామని ఆయన ప్రకటించారు.

తాజా సినిమా వీడియోల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos