వారితో ఉన్న బిజెపి బంధం బయటపడుతుంది

Priyanka Chaturvedi
Priyanka Chaturvedi

న్యూఢిల్లీ: ఎన్నికల  బాండ్ల వివరాల విషయంపై ఎన్నికల సంఘానికి తెలియజెయాలన్న సుప్రీంకోర్టు తీర్పును ప్రతిపక్షాలు స్వాగతించాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది మాట్లాడుతు కాంగ్రెస్‌ పార్టీ విరాళాల విషయంలో పారదర్శకంగా ఉందని తెలిపారు. అలాగే ప్రతి పార్టీ కూడా ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని ఆమె సూచించారు. ఈ క్రమంలో ప్రియాంక చతుర్వేది బిజెపి ప్రభ్వుతంపై మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పుతో బిజెపి మిత్రులతో ఉన్న బంధం బయటపడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. బిజెపి అధికారంలోకి వచ్చిన ఈ ఐదేళ్లలో ఎటువంటి అభివృద్ధి చర్యలు తీసుకోలేదని ఆమె ఆరోపించారు. కాని ఢిల్లీలో వారికి మాత్రం సౌకర్యవంతమైన పార్టీ కార్యలయాన్ని మాత్రం నిర్మించుకుందని ఆమె విమర్శించారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/