బిజెపి పార్లమెంటరీ పార్టీ భేటి ప్రారంభం

Amit Shah and Pm Modi
Amit Shah and Pm Modi

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌కు ముందు బిజెపి పార్లమెంటరీ పార్టీ ఈరోజు పార్లమెంట్‌ లైబ్రరీ భవనంలో సమావేశమైంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత బిజెపి ఎంపిల తొలి సమావేశం ఇదే. అయితే బడ్జెట్‌తో పాటు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోయే కీలక బిల్లులు, పార్టీ అజెండా గురించి ప్రధాని నరేంద్రమోడి ఎంపిలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్రమోడి , కేంద్రమంత్రులు, పార్టీ ఎంపీలు హాజరయ్యారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/