రాహుల్‌ గాంధీపై బిజెపి ఎంపి పిటిషన్‌

Rahul Gandhi
Rahul Gandhi

న్యూఢిల్లీ: బిజెపి ఎంపి మీనాక్షి లేఖీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ చేసేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. అయితే ఈ పిటిషన్ ఈ నెల 15న విచారణకు రానుంది. రఫెల్ కేసు విచారణలో సుప్రీం తీర్పుపై రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఎంపీ ఆరోపించారు. ప్రధాని మోడి రఫెల్ దొంగ అంటూ సుప్రీం చెప్పినట్లు రాహుల్ వ్యాఖ్యానించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలను కోర్డు ధిక్కరణగా పరిగణించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/