కమల్‌ వ్యాఖ్యలపై బిజెపినేత ఈసికి ఫిర్యాదు

kamal haasan
kamal haasan

న్యూఢిల్లీ: నాథూరామ్‌ గాడ్సేను ఉద్దేశిస్తూ ప్రముఖ నటుడు, మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌ హాసన్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ బిజెపి నేత అశ్విని ఉపాధ్యా§్‌ు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కమల్‌ ప్రచారంలో పాల్గొనకుండానే ఐదు రోజుల పాటు నిషేధం విధించాలని కోరారు.
తమిళనాడులో అరవకురిచిలో ఆదివారం జరిగిన ఓ ప్రచార ర్యాలీలో కమల్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్వతంత్ర భారత్‌లో తొలి ఉగ్రవాది హిందువు, ఆయన పేరు నాథూరామ్‌ గాడ్సే. అప్పటి నుంచే ఉగ్రవాదం ప్రారంభమైంది. ఈ ప్రాంతంలో ముస్లిం సోదరులు ఎక్కువగా ఉన్న కారణంగా తాను ఈ వ్యాఖ్యలు చేయడంలేదని, గాంధీ ఎదుట నిలబడి ఈ మాటలు మాట్లాడుతున్నానని కమల్‌ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు తమిళనాటే కాక దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. హిందూ ఉగ్రవాదం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను పలువురు ఖండించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/