కర్ణాటక స్పీకర్‌ పదవికి విశ్వేశ్వర్‌హెగ్డే కగెరి నామినేషన్‌

కర్ణాటక కొత్త స్పీకర్ ఈయనే..

 MLA Vishweshwar Hegde Kageri files nomination
MLA Vishweshwar Hegde Kageri files nomination

బెంగళూరు: కర్ణాటకలో బిజెపి విశ్వాసపరీక్షలో నెగ్గిన అనంతరం స్పీకర్ పదవికి కేఆర్ రమేష్ కుమార్ రాజీనామా చేయడంతో కొత్త స్పీకర్ ఎన్నికకు మార్గం సుగమమైంది. దీంతో కర్ణాటక స్పీకర్ పదవికి బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ హెగ్డే కగెరి నామినేషన్ వేశారు. సిర్సి నియోజవకర్గానికి చెందిన కగెరి మంగళవారంనాడు తన నామినేషన్ సమర్పించారు. ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప, పార్టీ సీనియర్ నేతలు ఆయన వెంట నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కగిరె గతంలో కర్ణాటక విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. తాజాగా స్పీకర్‌గా ఆయనొక్కరే నామినేషన్‌ వేయడంతో గురువారంనాడు ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలున్నాయి.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/