బిజెపి ఎమ్మెల్యేపై ఆరేళ్లు స‌స్పెన్ష‌న్‌ వేటు

ranav Singh Champion
ranav Singh Champion


ఉత్తరాఖండ్‌: వివాదాలతో వార్తల్లో నిలిచే బిజెపి ఎమ్మెల్యే ప్రణవ్‌ సింగ్‌ చాంపియన్‌పై వేటు పడింది. ఆయనను ఆరేళ్లపాటు సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఉత్తరాఖండ్‌లోని ఖాన్‌పూర్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన, కొద్ది రోజుల క్రితం కాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి ఐన సంతోషంతో తన అనుచరులను ఓ హోటల్‌లో పార్టి ఇచ్చారు. ఆ పార్టీలో మద్యం సేవించిన ప్రణవ్‌ సింగ్‌, తుపాకులతో హల్‌ చల్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో పార్టీ అధిష్టానం ఈ ఘటనపై స్పందించింది. ప్రణవ్‌సింగ్‌ను ఆరేళ్లపాటు పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా..గతంలో ఓ జర్నలిస్టును చంపేస్తానంటూ బెదిరించిన ఘటనలో ఆయనను మూడు నెలల పాటు సస్పెండ్‌ చేసిన అధిష్టానం, తాజా ఘటన నేపథ్యంలో ఆరేళ్లు సస్పెండ్‌ చేసింది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/