కేంద్ర పథకాలకు అడ్డంకులు సృష్టించొద్దు

Debasree Chaudhuri
Debasree Chaudhuri

న్యూఢిల్లీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకుని పనిచేయాలని, కేంద్ర పథకాల్ని అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించరాదని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి దేబశ్రీ చౌదరి బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కోరారు. ఒకవేళ కేంద్ర పథకాలకు అడ్డంకులు సృష్టించినట్లుయితే ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా అమలవుతున్న తీరుగానే బెంగాల్‌లోనూ కేంద్ర పథకాలు కొనసాగాలని కోరుకుంటున్నానని అన్నారు.
తాజా ఎన్నికల్లో రా§్‌ుగంజ్‌ నియోజకవర్గం నుంచి ఎన్నికైన దేబశ్రీ చౌదరి..మోది మంత్రి వర్గంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కొత్త ప్రభుత్వం మహిళా సాధికారతను అత్యంత ప్రాధాన్య అంశంగా పరిగణిస్తుందని తెలిపారు.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/