అజంఖాన్‌ వ్యాఖ్యలపై బిజెపి సభ్యులు ఆగ్రహం

అజంఖాన్ తలను పార్లమెంట్ గుమ్మానికి వేలాడదీయండి

Deputy Speaker Rama Devi,MP Azam Khan
Deputy Speaker Rama Devi,MP Azam Khan

ఢిల్లీ: లోక్ సభలో ట్రిపుల్ తలాఖ్ బిల్లుపై చర్చ జరుగుతున్నప్పుడు సమాజ్ వాదీ పార్టీ ఎంపి అజంఖాన్ డిప్యూటీ స్పీకర్ రమాదేవీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో అజంఖాన్ యుపి బిజెపి నాయకుడు అప్తాబ్ అద్వానీ అగ్రహం వ్యక్తం చేశాడు. అజంఖాన్ తల నరికి పార్లమెంట్ గుమ్మానికి కట్టాలని మోడీ ప్రభుత్వానికి సూచించాడు. ఇప్పుడున్న ఎంపిలో అజంఖాన్, అసదుద్దీన్ ఒవైసి వంటి వాళ్లు మహిళలను కించపరుస్తున్నారని వాళ్లకు గట్టిగా బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. అజంఖాన్ పిచ్చి పట్టిన కుక్కలాగా మొరుగుతున్నాడని, పిచ్చి కుక్కను చంపినట్టు చంపాలని అప్తాబ్ మండిపడ్డారు. ఇంతకు ముందు జయప్రదపై చేసిన వ్యాఖ్యలు దూమారం లేపిన విషయం తెలిసిందే. లోక్ సభలో రమాదేవీ మిమ్మల్ని తదేకంగా చూస్తున్నానని.. మీరేమో పక్కకు చూడమంటున్నారని, రోజంతా కళ్లలో కళ్లు పెట్టి చూడలని అజంఖామ్ వ్యాఖ్యలు పెనుదుమారం రేపుతున్నాయి. దీంతో సభలో ఉన్న బిజెపి సభ్యులు అజంఖాన్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


తాజా ఫోటో గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/photo-gallery/