ఉప ఎన్నికల్లో విజయం కోసం బిజెపి మాస్టర్‌ ప్లాన్‌

BJP
BJP

బెంగళూరు: కర్ణాటకలో ప్రస్తుతం బిజెపిదే అధికారం. రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బిజెపి ఎక్కువ సీట్లు గెలుచుకోవాలి. సవాల్‌గా మారిన ఈ ఉప ఎన్నికలకు బిజెపి కసరత్తు చేస్తున్నది. రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం అయిదేళ్లు అధికారంలో ఉండాలంటే ఈ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను గెలిపించుకోవాలి. ఎందుకంటే ఉప ఎన్నికల భవిష్యత్తు కర్ణాటక ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుందని సిఎం యెడియూరప్ప ఆలోచన. ఉప ఎన్నికల్లో 15 నియోజకవర్గాల్లో బిజెపి విజయం సాధించేలా యెడియూరప్ప ప్లాన్‌ చేస్తున్నారు. అభ్యర్థి ఏ పార్టీ వారైనా సరే విజయం మాత్రమే తమదేనంటూ ఉప ఎన్నికలు జరుగుతున్న 15 శాసనసభ నియోజకవర్గాల్లో బిజెపి నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. దీంతో ప్రతిపక్షాల కథ ముగిసినట్లేనని బిజెపి వర్గాలు అంటున్నాయి. ప్రతి ఇంటికి వెళ్లి బిజెపి గురించి ప్రచారం చేయాలని స్థానిక నాయకులకు సిఎం యెడియూరప్ప సూచించారు. ప్రతి నియోజకవర్గానికి ఒక మంత్రిని ఇన్‌ఛార్జిగా నియమిస్తే ప్రభుత్వ పథకాల వివరాలు ప్రజలకు వివరించేందుకు అవకాశముంటుందని సిఎం భావిస్తున్నారు. బిజెపి అభ్యర్థులను గెలిపిస్తే నియోజకవర్గాలను మరింత అభివృద్ధి చేస్తామని ప్రజలకు హామీలు ఇవ్వగలుతారని యెడియూరప్ప అన్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/