బీఎస్‌ఎన్‌ఎల్‌కు 38వేల బిల్లు ఎగ్గొట్టిన వరుణ్‌ గాంధీ

Varun Gandhi
Varun Gandhi

న్యూఢిల్లీ: బిజెపి పార్టీ నాయకుడు వరణ్‌ గాంధీపై జిల్లా ఎన్నికల అధికారికి బిఎస్‌ఎన్‌ఎల్‌ ఫిర్యాదు చేసింది. గాంధీ.. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌కు భారీ మొత్తంలో బిల్లు ఎగ్గొట్టారు. రూ. 38,616ల ఫోన్‌ బిల్లు చెల్లించకుండా ఫిలిబిత్‌ లోక్‌సభ నియోజకవర్గానికి నామినేషన్‌ దాఖలు చేసిన వరుణ్‌ గాంధీపై చర్యలు తీసుకోవాలని ఈ ఫిర్యాదు చేసింది. అయితే వరుణ్‌ గాంధీ 200914 మధ్య కాలంలోఫిలిబిత్‌ ఎంపీగా ఉన్న సమయంలో అక్కడ ఏర్పాటు చేసిన నియోజకవర్గ ఆఫీసుకు ఒక ఫోన్‌ను సమకూర్చారు. ఐదేళ్ల కాలానికి ఈ ఫోన్‌ బిల్లు రూ. 38,616 అయింది. అయితే ఈ బిల్లు కట్టకుండానే, బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ తీసుకోకుండానే వరుణ్‌ గాంధీ ఫిలిబిత్‌ నుంచి నామినేషన్‌ దాఖలు చేశారు. దీనిపై బీఎస్‌ఎన్‌ఎల్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వరుణ్‌ గాంధీపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది. అయితే ఎన్నికల్లో పోటీ చేయదలచుకున్న అభ్యర్థులందరూ.. ప్రభుత్వ సంస్థల నుంచి నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ తీసుకుని నామినేషన్‌ పత్రాలకు జతపర్చాలి. ఒక వేళ అభ్యర్థి ఈ నియమాలు పాటించకపోతే ఆ నామినేషన్‌ తిరస్కరించబడుతుంది. వరుణ్‌ గాంధీ మళ్లీ ఫిలిబిత్‌ నుంచి పోటీ చేస్తున్నారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/