బిజెపి షాక్‌, కాంగ్రెస్‌లో చేరిన పార్టీ ఎంపి అశోక్‌కుమార్‌ దోహ్రే..

Rahul Gandhi , BJP leader Ashok Kumar Doharey
Rahul Gandhi , BJP leader Ashok Kumar Doharey

న్యూఢిల్లీ, : దేశంలోని అతిపెద్ద రాష్ట్ర ఉత్తరప్రదేశ్‌లో అధికార బిజెపికి గట్టి షాక్‌ తగిలింది. ఎన్నికల వేళ ఆ పార్టీ ఎంపి ఒకరు ఝలక్‌ ఇచ్చారు. రాహుల్‌ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారు. బీహర్‌లోని పట్నాసాహిబ్‌ ఎంపి, సినీనటుడు శత్రుఠ్నసిన్హా ఏప్రిల్‌ 6న కాంగ్రెస్‌లో చేరనున్న ప్రకటించడంతో ఇప్పటికే బిజెపి షాక్‌లో ఉంది.తాజాగా ఉత్తరప్రదేశ్‌ నుంచి సిట్టింగ్‌ అశోక్‌కుమార్‌ దోహ్రే బిజెపికి గుడ్‌బై చెప్పడంతో పార్టీ వర్గిలు ఆందోళన చెందుతున్నాయి. ఈ రోజు అశోక్‌కుమార్‌ ఎఐసిసిచీఫ్‌ రాహుల్‌గాంధీ సమక్షంలో పార్టీలో చేరగా, ఆయనకు కండువా వేసి రాహుల్‌ ఆహ్వానించారు.

మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/