ఢిల్లీ సిఎంకు నిరాశ..ఏడు స్థానాల్లో బిజెపి అధిక్యం

BJP party
BJP party

ఢిల్లీ: ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌కు నిరాశ తప్పేలా ఉంది. లోక్‌సభ ఎన్నికలకు గానూ ఇక్కడ మొత్తం ఏడు స్థానాలు ఉండగా మొత్తం స్థానాల్లో బిజపి ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా ఆధిక్యాన్ని ప్రదర్శించలేకపోతున్నాయి. కాంగ్రెస్‌ఆప్‌లు చివరి వరకు పొత్తు కోసం ప్రయత్నించి, ఆ తర్వాత విడివిడిగా పోటీ చేయడం బీజేపీకి కలిసి వచ్చింది. ఆప్ అభ్యర్థులు మొత్తం వెనకంజలో ఉన్నారు. దీంతో కేజ్రీవాల్ నివాసం బోసి పోయింది.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/