తెలంగాణలో కూడా బిజెపి సత్తా చాటుతుంది

Yeddyurappa
Yeddyurappa

హైదరాబాద్‌: కర్ణాటక మాజీ సిఎం యెడ్యూరప్ప ఈరోజు వికారాబాద్‌ జిల్లా తాండూరులోని భావిగి భద్రేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శంచి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత మీడియాతో మాట్లాడుతు తెలంగాణలో కూడా బిజెపి సత్తా చాటుతుందని… సికింద్రాబాద్, మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకుంటుందని ఆయన అన్నారు. దేశ వ్యాప్తంగా ప్రధానిమోడి గాలి వీస్తోందని చెప్పారు. కేంద్రంలో బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని అన్నారు. 280 సీట్లు సాధించి మోదీ మరోసారి ప్రధాని పీఠాన్ని అధిష్ఠించబోతున్నారని చెప్పారు. కర్ణాటలో 20 నుంచి 22 ఎంపీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకోబోతోందని తెలిపారు.


మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/