బిజెపిసేనకూటమిదే విజయం

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ

nitin gadkari
nitin gadkari

ముంబయి: మహారాష్ట్ర, హర్యానాలలో అసెంబ్లీ ఎన్నికలకు ఓటింగ్‌ ప్రారంభమైంది. భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నది. మహారాష్ట్రలో అసెంబ్లీ మొత్తం సీట్లు 288 ఉండగా, ఇక్కడ బిజెపి, శివసేన కూటమి పోటీ చేస్తున్నది. హర్యానాలో 90 సీట్లకు పోటీ జరుగుతున్నది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌, కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ, పీయూష్‌ గోయల్‌, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ అజిత్‌ పవార్‌లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బిజెపి-శివసేన కూటమి రికార్డు స్థాయిలో విజయం సాధిస్తుందని, ఫడ్నవీస్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తిరిగి ప్రమాణం చేస్తారన్నారు. ప్రధాన మంత్రి నాయకత్వంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి మళ్లీ ఫడ్నవీస్‌ అవుతారని ముంబయిలో ఓటేసిన రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ చెప్పారు. గోయల్‌ మాట్లాడుతూ బిజెపి – శివసేన కూటమి 225 సీట్లు గెలుస్తారన్నారు. ప్రజలు మోడీ, ఫడ్నవీస్‌ వెంటే ఉన్నారన్నారు. ప్రతిపక్షం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. ప్రజలకు ప్రధాని మోడీపై అభిమానముందని అది బిజెపి ఓటు బ్యాంకుకు పనివస్తుందన్నారు. మహారాష్ట్రలోని 288 సీట్లలో బిజెపి 150 సీట్లకు పోటీ చేస్తుండగా, శివసేన 124 సీట్లకు పోటీ చేస్తుందన్నారు. ఎన్‌డిఎ కూటమిలో ఉన్న ఇతర 14 మంది అభ్యర్థులు బిజెపి పార్టీ కమలం గుర్తుతో పోటీ చేస్తున్నారన్నారు. ప్రజలందరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మోడి ట్వీట్‌ చేశారు. మహారాష్ట్ర, హర్యానాలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. భారత్‌లోని మరికొన్ని ప్రాంతాలలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/international-news/