ఇది దేశంలో బిజెపి పరిస్థితి

జార్ఖండ్‌ ఫలితాలపై బిజెపికి చిదంబరం కౌంటర్‌

Chidambaram
Chidambaram

ఢిల్లీ: జార్ఖండ్‌ ఎన్నికల ఫలితాలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం బిజెపి కౌంటరిచ్చారు. గతంలో 37 స్థానాల్లో గెలిచిన బిజెపి, ఎజేఎస్‌యూతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజా ఫలితాల్లో మాత్రం బిజెపికి గట్టి దెబ్బ తగిలిందనే చెప్పాలి. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో బిజెపి 11 స్థానాల్లో గెలిచి, మరో 13 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇకపోతే కాంగ్రెస్‌-జేఎంఎం-ఆర్‌జేడి కూటమి తన ఆధిక్యాన్ని కొనసాగిస్తుంది. మొత్తంగా 47 స్థానాలు(గెలుపు+ఆధిక్యం) జోరుతో ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలోనే ట్విట్టర్‌ వేదికగా చిదంబరం స్పందిచారు. హరియాణాలో దెబ్బతిన్నారు, మహారాష్ట్రలో వద్దనిపించుకున్నారు, ఇప్పుడిక జార్ఖండ్‌లో ఓడిపోయారు. ఇది 2019లో బిజెపి కథ. దీని బిజెపియేతర పార్టీలన్నీ గుర్తించాలి. భారత రాజ్యాంగ పరిరక్షణకై కాంగ్రెస్‌తో కలిసి నడవాలి అని చిదంబరం ట్వీట్‌ చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana