మళ్లీ ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు..పార్లమెంట్‌లోకి

Ravi Shankar
Ravi Shankar

న్యూఢిల్లీ: 16వ లోక్‌సభ రద్దు కావడంతో ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు విలువ కోల్పోయింది. అయితే ఆ బిల్లును మళ్లీ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ తెలిపారు. మూడుసార్లు తలాక్‌ చెబితే, విడాకులు ఇచ్చే సంప్రదాయాన్ని నిషేధించాలని మోడి ప్రభుత్వం భావిస్తున్నది. దానిలో భాగంగానే ట్రిపుల్ త‌లాక్ బిల్లును తెచ్చారు. రాజ్య‌స‌భ‌లో ఆ బిల్లు పెండింగ్‌లో ఉండిపోయింది. అయితే త్రిపుల్ త‌లాక్ బిల్లు త‌మ పార్టీ మేనిఫెస్టోలో ఉంద‌ని మంత్రి ర‌విశంక‌ర్ తెలిపారు. యూనిఫాం సివిల్ కోడ్ విధానంపై స్పందిస్తూ.. దీనిపై రాజ‌కీయ సంప్ర‌దింపులు చేప‌డుతామ‌న్నారు.


తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/