మైనర్‌ బాలికను అత్యాచారం చేసిన ఎమ్మెల్యె

RJD MLA Arun Yadav
RJD MLA Arun Yadav

పాట్నా: ఆర్జెడి ఎమ్మెల్యె, మైనర్ బాలికపై అత్యాచారం చేసినట్టుగా పోలీసులు కేసు నమోదు చేసి ఛార్జ్ షీటు కోర్టులో దాఖలు చేశారు. ప్రస్తుతం ఆ ఎమ్మెల్యె పరారీలో ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారంఉ. సాండర్స్ నియోజకవర్గానికి చెందిన ఆర్జెడి ఎమ్మెల్యె అరుణ్ యాదవ్ మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. దీంతో సదరు బాలికపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు సదరు ఎమ్మెల్యెపై పోస్కో, లైంగిక వేధింపులు, అత్యాచారం కేసులు నమోదు చేశారు. కానీ అరుణ్ యాదవ్ పరారీలో ఉన్నారు. నిందితుడు లేకపోవడంతో ఫిబ్రవరి 10కి తీర్పును కోర్టు వాయిదా వేసినట్టు సమాచారం. అరుణ్ యాదవ్ కు సంబంధించిన ఆస్తులను కోర్టుకు అటాచ్ చేసినట్టు జడ్జ్ ఆర్ కె సింగ్ తెలిపారు. పేద కుటుంబాలకు చెందిన బాలికకు ఎదో ఒక ఆశ చూపి సెక్స్ రాకెట్ లోకి కొందరు దించుతున్నారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/