బీహార్ మాజీ సిఎం జగన్నాథ్ మిశ్రా కన్నుమూత

Bihar former CM Jagannath Mishra
Bihar former CM Jagannath Mishra

న్యూఢిల్లీ: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, జెడియు నాయకుడు జగన్నాథ్ మిశ్రా ఈరోజు ఉదయం కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 82 సంవత్సరాల మిశ్రా మూడుసార్లు బీహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. బీహార్ రాజకీయాలలోకి ఆర్‌జెడి నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ ప్రవేశించడానికి ముందు జగన్నాథ్ మిశ్రా ఆ రాష్ట్రంలో తిరుగులేని నాయకుడిగా ఉన్నారు. మిశ్రా మృతికి బీహార్ ముఖ్యమంత్రి నితిశ్ కుమార్ సంతాపం ప్రకటించారు. మిశ్రా మృతికి మూడు రోజుల సంతాపాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో మిశ్రాకు అంత్యక్రియలు జరుగుతాయని ముఖ్యమంత్రి ప్రకటించారు.
కాగా 1937లో జన్మించిన మిశ్రా… బీహార్ యూనివర్శిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్ గా పని చేశారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1983లో బీహార్ అసెంబ్లీలో అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగడుతూ 2 గంటల పాటు ఏకధాటిగా ఆయన చేసిన ప్రసంగాన్ని ఇప్పటికీ ప్రజలు గుర్తుంచుకుంటారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/

: