రాహుల్‌ వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేస్తా!

Sushil Modi , Rahul Gandhi
Sushil Modi , Rahul Gandhi

పట్నా: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మహరాష్ట్రలోని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మోడిపై విమర్శలు చేశారు. దేశంలో ఉన్న దొంగలంతా మోదీలే ఎందుకయ్యారని.. లలిత్‌మోదీ, నీరవ్‌మోదీ, నరేంద్రమోదీ వీరందరి ఇంటిపేరు మోదీయే అని రాహుల్‌ అన్నారు. ఈవ్యాఖ్యలపై రాహుల్‌గాంధీపై పరువు నష్టం దావా వేస్తానని బిహార్‌ ఉపముఖ్యమంత్రి సుశీల్‌కుమార్‌ మోదీ ఈరోజు తెలిపారు. దొంగలంతా మోదీ ఇంటిపేరుతోనే ఉన్నారు అని రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు తమను అవమానపరిచేవిలా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో ఉన్న దొంగలంతా మోడి ఇంటిపేరునే కలిగిఉన్నారని రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించి మమ్మల్నందర్నీ అవమానించారు. మా భావోద్వేగాలు రెచ్చగొట్టేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. అందుకే రెండురోజుల్లో పట్నా హైకోర్టులో రాహుల్‌గాంధీపై పరువునష్టం దావా వేస్తానని గ సుశీల్‌కుమార్‌ మోడి పేర్కొన్నారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/