మోడిపై ఈసీకి ఫిర్యాదు చేసిన సిఎం

Bhupesh Baghel
Bhupesh Baghel


రాయ్‌పూర్‌ : ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడి ఈనెల 6న ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బాలోద్‌ జిల్లాలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతు సైన్యం, మెరుపుదాడుల ప్రస్తావన తీసుకువచ్చారని ఇలా మాట్లాడాం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూఆ రాష్ట్ర సిఎం భూపేశ్‌ భగేల్‌ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.ఈ మేరకు సోమవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నాయకులతో కలిసి ఆయన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుబ్రత్‌ సాహూకు లేఖ అందించారు. అలాగే మోదీ ప్రసంగాన్ని సైతం సీడీ రూపంలో సమర్పించారు. ఖఈ ఐదేళ్లలో చేసిన అభివృద్ధి పనులను వివరించడం కంటే భారత సైనిక దళాల సామర్థ్యాన్ని కీర్తిస్తూ.. మోదీ గొప్పలు చెప్పుకున్నారు. ఆర్మీ పేరు చెప్పి ఆయన ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూశారుగగ అని భూపేశ్‌ భగేల్‌ లేఖలో పేర్కొన్నారు. ప్రసంగంలో మోదీ మెరుపు దాడులు, వైమానిక దాడులు, రక్షా కవచ్‌ లాంటి పదాలను పదే పదే ఉపయోగించారని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం ఎన్నికల ప్రచారంలో ఆర్మీ ప్రస్తావన తీసుకురావద్దని ఈసీ స్పష్టం చేసినప్పటికీ.. మోదీ అనేక సార్లు సైనికల దళాల గురించి ప్రచారంలో మాట్లాడుతున్నారన్నారు. ఇది నియమావళిని ఉల్లంఘించడమేనని అభిప్రాయపడ్డారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/