భారత్‌ మిమ్మల్ని చూసి గర్వపడుతోంది

RAmnath kovind
RAmnath kovind

కోయంబత్తూరు: తమిళనాడులోని సులుర్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో నిర్వహించిన ఓ కారక్రమంలో పాల్గొన్న రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌ మాట్లాడుతు భారత్‌ శాంతికి కట్టుబడి ఉంటుందని అయితే అవసరమైన సందర్భాల్లో మన భద్రతా బలగాలు సార్వభౌమత్వ రక్షణ శక్తిని చూపుతాయి. మనకు రక్షణగా మన ముందు ఉండే భద్రతా బలగాలు, వైమానిక దళాలు దేశాన్ని రక్షించే క్రమంలో.. పరిష్కార మార్గాలను ప్రతిబింబించేలా పనిచేస్తాయి. ఇటీవల మన వైమానిక దళ సాహసాన్ని చూశాం. ఉగ్రవాద శిబిరాలపై ఐఏఎఫ్ దాడులు చేసింది అని వ్యాఖ్యానించారు దేశానికి సేవలందించిన వైమానిక దళ సిబ్బందికి, ప్రస్తుతం సేవలందిస్తున్న వారికి నేను ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతున్నాను. భారత్‌ మిమ్మల్ని చూసి గర్వపడుతోంది అని రామ్‌నాథ్‌ కోవింద్‌ వ్యాఖ్యానించారు.