12 ప్లాస్టిక్‌ వస్తువుల నిషేధం!

plastic
plastic


న్యూఢిల్లీ: ప్లాస్టిక్‌ బాటిల్స్‌, డెకోరేషన్‌ థర్మకోల్‌, సిగరెట్‌ బట్స్‌తో పాటు 12 ప్లాస్టిక్‌ వస్తువులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించనుంది. కేంద్రం సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై యుద్ధం ప్రకటించింది. యూజ్‌ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించే పని దశలవారీగా నిర్వహిస్తామని కేంద్ర మంత్రి రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ తెలిపారు. సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ద్వారా ఇప్పటికే నిషేధించాల్సిన ఆ
ప్లాస్టిక్‌ వస్తువుల జాబితాను రూపొందిచామన్నారు. క్యారీబాగ్స్‌, నాన్‌ వోవెన్‌ క్యారీ బ్యాగ్స్‌, ప్లేట్లు, ల్యామినేటెడ్‌ బాణాలు, ప్లేట్లు, చిన్న ప్లాస్టిక్‌ కప్పులు, కంటెయినర్లు, ఇయర్‌బడ్స్‌కి ఉపయోగించే ప్లాస్టిక్‌ పుల్లలు, బెలూను, జండాలు, క్యాండీస్‌, సిగరెట్‌ బట్స్‌, పాలీస్టైరెన్‌, బేవరేజెస్‌కు ఉపయోగించే ప్టాస్టిక్‌, రోడ్లపై పెట్టే బ్యానర్లువంటి వాటిని ప్రభుత్వం నిషేధిస్తుందన్నారు. సింగ్‌ల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను దేశవ్యాప్తంగా నిషేధించేందుకు కాలుష్య నియంత్రణ మండలి నడుం బిగించింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/