సిద్ధార్థ అంశంపై స్పందించిన మాల్యా!

మాల్యా ట్విటర్‌ వేదికగా అనేక ఆరోపణలు 

Vijay Mallya
Vijay Mallya

న్యూఢిల్లీ: బ్యాంకులకు రూ.9,000 కోట్ల అప్పు ఎగవేత కేసులో నిందితుడు విజయ్‌ మాల్యా కేఫ్‌ కాఫీ డే యజమాని వి.బి సిద్ధార్థ అంశంపై స్పందించారు. సిద్ధార్థ ఉదంతమే ప్రభుత్వ యంత్రాంగం వేధింపులకు నిదర్శనమని ఆరోపించారు. తనని కూడా అలాగే వేధిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఖఖనాకు వి.జి. సిద్ధార్థతో పరోక్ష సంబంధాలు ఉన్నాయి. మంచి వ్యక్తి. తెలివైన వ్యాపారవేత్త. తను రాసిన లేఖలోని అంశాలను చూసి నేను తీవ్ర నిరాశకు గురయ్యాను. ప్రభుత్వ ఏజేన్సీలు, బ్యాంకులు ఎవరినైనా నిరాశలోని నెట్టగలవు. బకాయిలన్నీ తిరిగి చెల్లిస్తానని చెబుతున్నప్పటికీ..నా విషయంలో వారెలా వ్యవహరిస్తున్నారో చూడండి. అదే పాశ్చాత్య దేశాల్లో అయితే.. అప్పులను తిరిగి చెల్లించేందుకు సహాయం చేస్తారు. కానీ నా విషయంలో మాత్రం చెల్లించడానికి ఉన్న అన్ని ప్రత్యామ్నాయాలను అడ్డుకుంటున్నారు అని మాల్యా ట్విటర్‌ వేదికగా అనేక ఆరోపణలు గుప్పించారు.


తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/