మోడితో దత్తాత్రేయ భేటీ

dattatreya-modi
dattatreya-modi

న్యూఢిల్లీ: హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఈరోజు ప్రధాని మోడితో
భేటీ అయ్యారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం దత్తాత్రేయ మోడితో భేటీ కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. సెప్టెంబరు 11న హిమాచల్ ప్రదేశ్ 27వ గవర్నర్ గా దత్తాత్రేయ బాధ్యతలు స్వీకరించారు. హిమాచల్ ప్రదేశ్ లో ప్రస్తుతం నెలకొని ఉన్న రాజకీయ పరిస్థితులపై దత్తాత్రేయ మోడికి వివరించినట్టు విశ్వసనీయ సమాచారం మేరకు తెలుస్తోంది. దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులపై కూడా వీరు చర్చించినట్టు తెలిసింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/