బాలు ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం

ఆసుపత్రికి వెళ్లిన కమలహాసన్

SP Balasubrahmanyam

చెన్నై: ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించినట్లు చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో బాలు కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఆసుపత్రి వద్ద ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. కాగా, బాలు పరిస్థితి తెలుసుకునేందుకు ప్రముఖ నటుడు కమలహాసన్ ఎంజీఎం ఆసుపత్రికి వెళ్లారు. బాలు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స జరుగుతోందని తెలిపారు. కాగా, బాలుకు ఇటీవలే కరోనా నెగెటివ్ వచ్చింది. అయినప్పటికీ ఊపిరితిత్తులో ఇన్ఫెక్షన్ కారణంగా ఆయనకు వెంటిలేటర్, ఎక్మో కొనసాగించారు. నిన్న జ్వరం రావడంతో ఆయన పరిస్థితి క్షీణించినట్టు తెలుస్తోంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/