పరువునష్టం కేసులో రాహుల్‌కు బెయిలు

Rahul Gandhi
Rahul Gandhi

అహ్మదాబాద్‌: రాహుల్‌ గాంధీకి క్రిమినల్‌ పరువునష్టం కేసులో అహ్మదాబాద్‌ మెట్రోపాలిటన్‌ కోర్టు ఈరోజు బెయిల్‌ మంజురు చేసింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ కో అపరేటివ్ బ్యాంక్, దాని చైర్మన్ అజయ్ పటేల్ ఈ క్రిమినల్ పరువునష్టం కేసు దాఖలు చేశారు దీంతో ఈరోజు రాహుల్ గాంధీ అహ్మదాబాద్ మెట్రోపాలిటిన్ కోర్టు ముందు హాజరయ్యారు. అంతకుముందు కోర్టుకు హాజరయ్యేందుకు అహ్మదాబాద్ వచ్చిన రాహుల్‌కు పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు సాదర స్వాగతం పలికారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/