అయోధ్య కేసుపై అంతిమ విచారణ ..

ayodhya
ayodhya

న్యూఢిల్లీ: అయోధ్యలో రామజన్మభూమి – బాబ్రీ మసీదు స్థల వివాదం కేసు న్యాయస్థానాల్లో 70 సంవత్సరాలుగా నలుగుతోంది. ఈ కేసుపై తుది విచారణ ముగిస్తామని, ఇకపై ఎలాంటి వాదోపవాదాలు ఉండవని సుప్రీంకోర్టు అయిదుమంది న్యాయమూర్తుల ధర్మాసనం స్పష్టం చేసిన నేపథ్యంలో అందరి దృష్టి వారిపై కేంద్రీకృతమైంది. అత్యంత సున్నితమైన, వివాదాస్పదమైన అయోధ్యకేసుపై సుప్రీంకోర్టు మరో మూడు రోజుల్లో అంతిమ విచారణ ముగించబోతున్నది. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు ఎలాం ఉంటుందనే అంశంపై దేశవ్యాప్తంగా ఉత్కంఠభరిత వాతావరణం నెలకొన్నది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గగో§్‌ు నేతృత్వం వహిస్తున్న అయిదుమంది న్యాయమూర్తల ధర్మాసనంలో జస్టిస్‌ ఎస్‌ఎ బొబ్డే, జస్టిస్‌ డివై చంద్రచూడ్‌, జస్టిస్‌ అశోక్‌భూషన్‌, జస్టిస్‌ ఎస్‌ఎ నజ్‌ీ సభ్యులుగా కొనసాగుతున్నారు. ఈ అయిదుమంది ఉమ్మడిగా రామజన్మభూమి – బాబ్రీ మసీదు స్థల వివాదానికి సంబంధించిన కేసులను విచారిస్తున్నారు. రెండు నెలల పాటు, 37 సార్లు ఈ కేసుపై విచారణ కొనసాగింది. ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. అయిదు మంది న్యాయమూర్తుల్లో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. కోట్లాది మంది హిందువులు, ముస్లింల మనోభావాలతో ముడిపడి ఉన్న కేసు కావడం వల్ల విచారణ సందర్భంగా వినూత్న విధానాలను అనుసరించారు. ప్రధాన కేసుకు అనుబంధంగా దాఖలైన ప్రతి చొన్న పిటిషన్‌ను కూడా విచారణకు స్వీకరించారు.

అభిప్రాయాలను వినిపించడంలో కక్షిదారులకు స్వేచ్ఛనిచ్చారు. కేసుపై విచారించే న్యాయవాదులకు వారి అభిప్రాయాలను నిక్కచ్చిగా వెల్లడించాలని సూచించారు. కేసు విచారణకు వచ్చిన ప్రతిసారి ఫుల్‌ బెంచ్‌ హాజరు కావడం మరో ప్రత్యేకత. అయోధ్య కేసులో ప్రధాన కక్షిదారులు రామ్‌లల్లా విరాజమాన్‌, నిర్మోహి అఖారా, సున్నీ వక్ఫ్‌బోర్డు ప్రతినిధులు వినిపించిన ప్రతి చిన్న అంశాన్ని పరిగణలోకి తీసుకున్నారు. చాలా సందర్భాల్లో నాయయమూర్తులు ఈ మూడు సంస్థల ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఎవరు కూడా వారి వైఖరి పట్ల వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. ఇదివరకు అలహాబాద్‌ న్యయస్థానం ఇచ్చిన ఆరువేల పేజీల తీర్పు విషయంలో పురావస్తు శాఖ నివేదిక కీలక పాత్ర పోషించింది. శ్రీరామచంద్రుడు జన్మించిన ప్రదేశంగా భావిస్తున్న రామ్‌చబుత్రపై పురావస్తుశాఖ అధికారులు ఇచ్చిన నివేదికకే కీలకమైనవి. ఇందుకు సంబంధించిన అంశాలపై విచారణ చేపట్టిన ప్రతిసారి సున్నీ వక్ఫ్‌ బోర్డు ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని అయిదుమంది న్యాయమూర్తులు సమయస్ఫూర్తిగా వ్యవహరించిన తీరు అసాధారణమని విశ్లేషకులు చెపుతున్నారు. పురావస్తు శాఖ నివేదిక ఆధారమే తప్ప, కళ్లతో చేసిన వారెవరూ లేరని, ఆ నివేదికను విశ్వసించక తప్పదని చెబుతూ వచ్చారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/