నాకు నీతో గొడవ పెట్టుకోవాలని ఉంది

  • నన్ను రెస్టారెంట్ కు తీసుకెళ్తానని చెప్పావు
Smriti Irani-Sushma Swaraj
Smriti Irani-Sushma Swaraj

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్‌ తీవ్ర గుండెపోటుతో నిన్న ఎయిమ్స్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే సుష్మాస్వరాజ్‌ మృతిపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సుష్మను ప్రేమగా దీదీ అని పిలిచే స్మృతి.. ట్విటర్‌ వేదికగా ఉద్విగ్నభరిత సందేశాన్ని పోస్టు చేశారు. ”నాకు నీతో గొడవ పెట్టుకోవాలని ఉంది దీదీ(సుష్మను ఉద్దేశిస్తూ). బన్సూరీ(సుష్మ కుమార్తె)తో కలిసి నన్ను రెస్టరెంట్‌కు తీసుకెళ్తానని మాటిచ్చావు. ఆ ప్రామిస్‌ను నెరవేర్చకుండానే నువ్వు వెళ్లిపోయావు” అని స్మృతి ఇరానీ ట్వీట్‌ చేశారు. కాగా గత ప్రభుత్వంలో సుష్మ, స్మృతి కేబినెట్‌ మంత్రులుగా పనిచేశారు. అంతకు ఎంతో కాలం ముందు నుంచే సుష్మా, స్మృతిలు మంచి స్నేహితులు.


తాజా ఆద్యాత్మికం వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/devotional/