బిజెపిలో చేరిన అమర జవాన్‌ తండ్రి

Aurangzeb's father joins BJP
Aurangzeb’s father joins BJP

శ్రీనగర్‌: గత సంవత్సరం జూన్‌ 14వ తేదీన రంజాన్‌ పురస్కరించుకొని జవాన్‌ ఔరంగజేబు తన ఇంటికి వస్తుండగా ఉగ్రవాదలు అతన్ని కిడ్నాప్‌ చేసి కాల్చిచంపిన విషయం తెలిసిందే. అయితే అతని తండ్రి హనీఫ్‌ బిజెపి పార్టీలో ఆదివారం చేరారు. ప్రధాని మోడి సమక్షంలో బిజెపి కండువాను కప్పుకున్నారు. హనీఫ్‌తో పాటు మాజీ ఆర్మీ అధికారి రాకేశ్‌ కుమార్ శర్మ కూడా బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా హనీఫ్ మాట్లాడుతూ.. బిజెపిపేదల అభివృద్ధి కోసం కృషి చేస్తోందని కొనియాడారు. గత ప్రభుత్వాల కంటే మోడి ప్రభుత్వం ఉత్తమమైనది అని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు పేదల కోసం చేసిందేమీ లేదని హనీఫ్‌ చెప్పారు.