బీహార్‌లో కాంగ్రెస్‌ నాయకుడి కాల్చివేత

muder
muder

పాట్నా : బీహార్‌కు చెందిన కాంగ్రెస్‌ నాయకులు రాకేశ్‌ యాదవ్‌ ను శనివారం తెల్లవారుజామున 6:30 గంటల సమయంలో వైశాలిలోని సినిమా రోడ్డులో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపారు. కాగా మీనాపూర్‌ గ్రామంలోని రాకేశ్‌ యాదవ్‌ ప్రతి రోజు ఉదయం తన ఇంటి నుంచి సుమారు 3 కిలోమీటర్ల మేర మార్నింగ్‌ వాక్‌ చేస్తారు. సినిమా రోడ్డులోని ఓ జిమ్‌లో వ్యాయామం చేసి ఇంటికి తిరిగి వస్తారు. జిమ్‌ వద్ద మాటు వేసిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు రాకేశ్‌ యాదవ్‌పై అయిదు రౌండ్ల కాల్పులు జరిపి పారిపోయారు. రక్తపు మడుగులో పడిపోయి ఉన్న యాదవ్‌ను చికిత్స నిమిత్తం సఫ్దర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. యాదవ్‌ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జిమ్‌ వద్ద ఉన్న సీసీ టీవీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/