షాహీన్‌బాగ్‌పై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేంద్రం బలప్రయోగం చేయవచ్చు!

asaduddin owaisi
asaduddin owaisi

న్యూఢిల్లీ: షాహీన్‌బాగ్‌‌పై హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా 50 రోజులుగా షాహీన్‌బాగ్‌లో కొనసాగుతున్న ఆందోళనలను అణచి వేసేందుకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేంద్రం బలప్రయోగం చేయవచ్చని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. షాహీన్‌‌బాగ్ ఆందోళనలు చేస్తున్న నిరసనకారులను బుల్లెట్లతో కాల్చి షాహీన్‌బాగ్‌ను మరో జలియన్ వాలాబాగ్ చేయవచ్చని ఎంపీ అసదుద్దీన్ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వం 2024 వరకు ఎన్సార్సీని అమలు చేయమని స్పష్టమైన సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. జాతీయ జనాభా గణన కోసం కేంద్రం రూ.3,900 కోట్లు ఖర్చు చేస్తుందని, తాను చరిత్ర విద్యార్థిని కాబట్టి హిట్లర్ సమయంలో లాగా రెండు సార్లు జనాభా గణన నిర్వహించాలనుకుంటుందా అని ఆయన ప్రశ్నించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/