కార్యకర్తలే మా పార్టీకి బలం

Arvind Kejriwal
Arvind Kejriwal

న్యూఢిల్లీ: నిస్వార్ధంగా సేవలు అందించే కార్యకర్తలే మా పార్టీకి బలమని ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. అయితే ఈరోజు ఆమ్‌ ఆద్మీ పార్టీ సామాజిక మాధ్యమాల బృందంలోకి వివేక్‌ అనే ఓ సభ్యుడి పుట్టిన రోజు వేడుకకు కేజ్రీవాల్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా వివేక్‌ తన ట్విటర్‌ ఖాతాలో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా ఆయన పంచుకున్నారు. ఖఖపార్టీలోని ఓ చిరు కార్యకర్తకి ఇది చాలా పెద్ద విషయంగగ అని ఆయన హిందీలో ట్వీట్‌ చేశారు. ఖఖమీ ఆశీర్వాదాలు అందించినందుకు కృతజ్ఞతలు సర్గగ అని‌ ఆయన పేర్కొన్నారు.తమ పార్టీ కార్యకర్త చేసిన ట్వీట్‌పై కేజ్రీవాల్ స్పందిస్తూ దాన్ని రీట్వీట్ చేశారు. ఖఖనిస్వార్థ కార్యకర్తలే ఆమ్‌ ఆద్మీ పార్టీ గొప్ప బలం. ఆప్‌ సాయంతో కార్యకర్తలు దేశానికి సేవ చేయడంలో ఎల్లప్పుడూ తీరిక లేకుండా ఉంటారుగగ అని పేర్కొన్నారు

.
తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/