ఢిల్లీ సిఎం పై మరోసారి దాడి

Arvind Kejriwal
Arvind Kejriwal

న్యూఢిల్లీ: ఢిల్లీ సిఎం ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో శనివారం ఢిల్లీలోని మోతీనగర్‌లో ఆయన రోడ్ షో నిర్వహిస్తున్నప్పుడు ఆయనపై మరోసారి దాడి జరిగింది. ఎరుపు రంగు టీ షర్ట్ ధరించిన ఓ వ్యక్తి.. కేజ్రీవాల్ ఉన్న ఓపెన్ టాప్ జీప్‌పైకి ఎక్కి.. ఆయన చెంపచెళ్లుమనిపించాడు. వెంటనే అతడిని ఆప్ కార్యకర్తలు వెనక్కి లాగేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని మోతీనగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అతడిని కైలాస్ పార్క్ వాపి సురేశ్‌గా గుర్తించినట్లు డీసీపీ మోనికా భరద్వాజ్ తెలిపారు. కేజ్రీవాల్‌పై దాడిని ఆప్ తీవ్రంగా ఖండించింది.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక చేయండి:https://www.vaartha.com/news/national/