బిజెపికి ఏ కారణంతో ఓటు వేయాలి?

దేశానికి రాజధానిగా ఉన్న..బడ్జెట్‌లో నిధుల కేటాయించలేదు

arvind kejriwal
arvind kejriwal

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. దేశానికి రాజధానిగా ఉన్నప్పటికీ.. న్యూఢిల్లీకి బడ్జెట్‌లో నిధులను కేటాయించలేదని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ మరోసారి ఢిల్లీవాసులపై సవతితల్లి ప్రేమను ప్రదర్శించిందని మండిపడ్డారు. బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు లేకపోవడంపై ఢిల్లీ బిజెపి నాయకులు ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు.. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ముగిసిన కొద్దిసేపటికే ఆయన ఆయన ట్విట్టర్‌లో స్పందించారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఢిల్లీ వాసులు బిజెపికి ఏ కారణంతో ఓటు వేయాలని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందే బిజెపి ఢిల్లీ పట్ల వివక్షను ప్రదర్శిస్తోందని, ఇక ఎన్నికల తరువాత అధికారంలోకి వస్తే.. పరిస్థితి ఎలా ఉంటుందని, తన ఎన్నికల హామీలను నెరవేర్చగలదా? అని కేజ్రీవాల్ ప్రశ్నించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/