అఖిలేశ్‌ యాదవ్‌కు ఢిల్లీ సిఎం ఫోన్‌

Arvind Kejriwal, Akhilesh Yadav
Arvind Kejriwal, Akhilesh Yadav

న్యూఢిల్లీ: ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సమాజ్‌ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌కు ఫోన్‌ చేశారు. అయితే 23న వెలువడనున్న సార్వత్రిక ఎన్నిక ఫలితాలు, భవిష్యత్ కార్యాచరణపై ఇరువురు నేతలు చర్చించారు. వారి చర్చల వివరాలను సమాజ్ వాదీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ మీడియాకువివరించారు. బిజెపిని అధికారంలోకి రాకుండా ఎలా అడ్డుకోవాలో ఇరువురు నేతలు చర్చించారని తెలిపారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలో చర్చించడం జరిగిందని చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ నమ్మదగినవి కాదని ఉత్తరప్రదేశ్ లోని మొత్తం 80 స్థానాల్లో ఎస్పీబీఎస్పీ కూటమికి 60కి పైగా స్థానాలు వస్తాయని సంజయ్ సింగ్ తెలిపారు. కేంద్రంలో బీజేపీ అధికారాన్ని కోల్పోనుందని చెప్పారు.


మరిన్ని జాతయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/