ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కీలక వ్యాఖ్యలు

Arvind Kejriwal. Chief Minister of the Delhi
Arvind Kejriwal. Chief Minister of the Delhi

స్యూఢిల్లీ :ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ చేపట్టిన ధర్నాకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, పశ్యిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, పలు పార్టీల నేతలు మద్దతు తెలిపారు. అనంతరం, ఏర్పాటు చేసిన సభలో కేజ్రీవాల్ మాట్లాడుతూ, మోదీ సర్కార్ ని తరిమికొట్టే సమయం ఆసన్నమైందని అన్నారు. ఢిల్లీలో తాము అధికారంలోకి వచ్చిన కొద్దికాలంలోనే అవినీతి, అక్రమాలను తరిమికొట్టామని చెప్పారు. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ లో ప్రభుత్వాలను మోదీ అనేక ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. కోల్ కతాలో సీబీఐ అధికారులను ఇటీవల అడ్డుకున్న ఘటనపై మమతా బెనర్జీని అభినందించారు.