అరుణ్‌ జైట్లీ అనూహ్య నిర్ణయం

Arun Jaitley

న్యూఢిల్లీ: బిజెపి సీనియర్‌ నేత అరుణ్‌ జైట్లీ గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. కేంద్రమంత్రి వర్గంలో తాను భాగం కాలేనని, అవసరమైతే సలహాలు ఇస్తానని నరేంద్ర మోడికి లేఖ రాశారు.
మోడి కి రాసిన లేఖను ట్విట్టర్‌లోనూ పోస్ట్‌ చేశారు. అయితే తాను ఐదేళ్ల పాటు నరేంద్ర
మోడి సారథ్యంలో పనిచేసినందుకు సంతోషంగా ఉంది. ఎన్డీయే ప్రభుత్వంలో నాకు కొన్ని బాధ్యతలు అప్పగించారు. గత 18 నెలలుగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాను. తగినంత విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. భవిష్యత్తులో నేను కొన్ని బాధ్యతలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను. నా ఆరోగ్యానికి, చికిత్సకు తగినంత సమయం కావాలి. కాబట్టి ఎలాంటి మంత్రి పదవి చేపట్టలేను. ఇది నాకు నేనుగా తీసుకుంటున్న నిర్ణయం. ప్రభుత్వానికి ఎలాంటి సలహాలు కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా అని లేఖలో పేర్కొన్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/