గ్రెనేడ్ విసిరిన వ్యక్తి అరెస్ట్

శ్రీనగర్‌ : నేడు ఉదయం జమ్మూ బస్టాండ్‌ లో జరిగిన గ్రెనేడ్‌ పేలుడులో 30 మంది గాయపడిన విషయం తెలిసిందే.బస్టాండ్ వైపు గ్రెనేడ్ విసిరిన వ్యక్తిని జమ్మూకశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు డీజీపీ దిల్బాగ్ సింగ్ తెలిపారు. గాయపడిన వారిలో చికిత్స పొందుతూ ఒకరు చనిపోగా..ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు.