రహస్య సమాచారాన్ని లీక్‌ చేసిన ఆర్మీ జవాన్‌ అరెస్ట్‌

Army jawan arrested
Army jawan arrested

హరియాణా: రవీందర్‌ కుమార్‌ అనే ఆర్మీ జవాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హరియాణాలోని మహేందర్‌గఢ్‌ జిల్లాకు చెందిన రవీందర్‌ కుమార్‌ 2017లో సైన్యంలో చేరారు. 2018లో పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో విధులు నిర్వహిస్తుండగా.. ఫేస్‌బుక్ ద్వారా ఓ యువతి పరిచయమైంది. ఆ యువతితో తరచూ ఛాటింగ్‌, వీడియో కాలింగ్‌ చేసే రవీందర్‌.. ఇటీవల ఆమెకు సైన్యానికి సంబంధించిన అనేక విషయాలు వెల్లడించినట్లు పోలీసుల విచారణలో తేలింది. జవాన్లు ఉపయోగించే రైఫిల్స్‌ ఫొటోలు కూడా ఆమెకు పంపించినట్లు తెలిసింది. సైన్యంలోని అంతర్గత విషయాలు, సమస్యాత్మక ప్రాంతాల గురించి చెప్పాడట. రవీందర్‌ చర్యల గురించి పోలీసులకు రహస్య సమాచారం రావడంతో అతడిపై నిఘా పెట్టారు. అతడిని నార్నల్‌ రైల్వే స్టేషన్‌లో పోలీసులు అరెస్టు చేశారు. రవీందర్‌తో ఛాటింగ్‌ చేసిన మహిళ పాకిస్థాన్‌కు చెందిన యువతిగా సమాచారం. అయితే దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


తాజా సినిమా ఫోటో గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/photo-gallery/