అమిత్‌ షాతో ముగిసిన జగన్‌ సమావేశం

కాసేపట్లో రవిశంకర్ ప్రసాద్ తో భేటి

Jagan-Amit-shah
Jagan-Amit-shah

న్యూఢిల్లీ: ఏపి సిఎం జగన్‌ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ ముగిసింది. ఈ సందర్భంగా అమిత్ షాకు జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర పునర్విభజన చట్టం కింద రావాల్సిన పలు పెండింగ్ అంశాలను గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టుపై ఏపి బిజెపి నేతలు చేస్తున్న విమర్శలపై కూడా అమిత్ షాతో మాట్లాడినట్టు తెలుస్తోంది. విద్యుత్ సంస్థలతో చేసుకున్న పీపీఏలపై కూడా చర్చ జరిగినట్టు సమాచారం. కాసేపట్లో కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో జగన్ భేటీ కానున్నారు. అనంతరం మరో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలవనున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/