బిజెపి కార్యకర్తలకు మరో టాస్క్‌

ఒక్కపూట భోజనం మానేయాలని మోదీ సూచన

naredra modi
naredra modi

దిల్లీ: నేడు బిజెపి వ్యవస్థాపక దినోత్సవ సందర్బంగా కరోనా పై పోరాడుతున్న వారికి సంఘీభావంగా పార్టీ కార్యకర్తలంతా ఒకపూట భోజనం మానేయాలని ప్రధాని మోది సూచించారు. కరోనా పై పోరులో భారతీయులందరూ ఏకతాటిపై ఉండేందుకు పార్టీ కార్యకర్తలకు నేడు ఈ టాస్క్‌ పెట్టారు. ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇది ఆచరించాలని కోరారు. అలాగే పార్టీ కార్యకర్తలందరికీ కూడా శుభాకాంక్షలు తెలిపారు. నేడు జరిగే పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో అందరూ సామాజిక దూరం పాటించాలని సూచించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/