కుమారస్వామికి మరో షాక్‌!

  • రాజీనామా బాటలో మరో 8మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు..?
CM Kumaraswamy
CM Kumaraswamy

బెంగళూరు: కర్ణాటకలో రాజకీయ సంక్షోభం గంటకో మలుపు తిరుగుతుంది. ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఇప్పటికే 16 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉండగా, మరో 8 మంది అదే దారిలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటివరకూ 12 మంది కాంగ్రెస్ సభ్యులు, ముగ్గురు జేడీఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా, అనారోగ్యంతో ఉన్నానని, సభకు రాలేనని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీమంతపాటిల్‌ చెప్పేశారు. దీంతో 16మంది బలనిరూపణకు దూరంగా ఉన్నట్టు కాగా, ఇప్పుడు మరో 8 మంది రిజైన్ యోచనలో ఉన్నట్టు వార్తలు రావడం కుమారస్వామికి కొత్త తలనొప్పిని తెచ్చి పెట్టేదే.


తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/