బీహార్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

Nitish Kumar
Nitish Kumar


బీహార్ : బీహార్ లోని నితీశ్ కుమార్ ప్రభుత్వం ఇప్పటికే మద్యపానంపై ఉక్కుపాదం మోపిన సంగతి తెలిసిందే. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాన్ మసాలా అమ్మకాలను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు నిన్నటి నుంచి అమల్లోకి వచ్చాయి. పాన్ మసాలా అమ్మకాలు, నిలువ, రవాణా అన్నింటిపై నిషేధం అమల్లోకి వచ్చింది.

ఈ సందర్భగా బీహార్ చీఫ్ సెక్రటరీ దీపక్ కుమార్ మాట్లాడుతూ, నిషేధాజ్ఞలను ఎవరు ఉల్లంఘించినా కఠినంగా శిక్షిస్తామని, జరిమానా కూడా విధిస్తామని హెచ్చరించారు. పాన్ మసాలా అమ్మకాలు, నిలువ, రవాణా, వినియోగాలపై పూర్తి స్థాయిలో నిఘా ఉంటుందని, దీనికి సంబంధించి ఒక పక్కా ప్రణాళిక ప్రభుత్వం వద్ద ఉందని చెప్పారు. ఆరోగ్యానికి హాని కలిగించే మెగ్నీషియం కార్బొనేట్ పాన్ మసాలాల్లో ఉన్నట్టు ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల్లో ల్లో తేలింది. ఈ రసాయణం గుండె సంబంధిత రుగ్మతలకు కారణమవుతుంది. ఈ నేపథ్యంలోనే, పాన్ మసాలాపై బీహార్ ప్రభుత్వం బ్యాన్ విధించింది. ప్రజల మంచి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని దీపక్ కుమార్ తెలిపారు. అయితే, పొగాకును పండించే రైతులపై ఎలాంటి ఆంక్షలు ఉండవని చెప్పారు.

తాజా ఆద్యాత్మికం వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/devotional/