శ్రీనగర్‌ లాల్‌ చౌక్‌లో జెండా ఎగురవేయనున్న అమిత్‌షా

Amit Shah
Amit Shah

కశ్మీర్‌: రేపు భారత్‌ ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకోనుంది. దేశ వ్యాప్తంగా దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరగుతున్నాయి. జమ్ముకశ్మీర్ లో కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా శ్రీనగర్ లోని లాల్ చౌక్ లో మువ్వన్నెల జెండాను ఎగురవేయనున్నారు. ఈ నేపథ్యంలో, అన్ని ఏర్పాట్లను చేయాలని జమ్ముకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆదేశాలు జారీ చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జమ్ముకశ్మీర్ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. కళాకారుల బృందాలతో ఇప్పటికే అక్కడ సందడి నెలకొంది. మరోవైపు, లడాఖ్ లో టీమిండియా క్రికెటర్ ధోనీ జాతీయ జెండాను ఎగురవేయనున్నాడు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/