అమిత్‌షాకు ఆర్థికశాఖ పదవి!

Amit Shah
Amit Shah

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గంలో మొదటిసారి చేరిన అమిత్‌షాకు ఆర్థిక శాఖ,కార్పొరేట్‌ వ్యవహారాల బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా కేబినెట్‌లో చోటు దక్కిన జైశంకర్‌కు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ బాధ్యతలు ఇచ్చే అవకాశాలున్నాయి. ఆయన గతంలో ఇదే శాఖ కార్యదర్శిగా పని చేశారు. అర్జున్‌ ముండాకు గిరిజన వ్యవహారాల బాధ్యతలు అప్పగించవచ్చు. స్మృతీ ఇరానీకి మహిళా, శిశు సంక్షేమ శాఖను అప్పగించే అవకాశం ఉంది. రమేశ్‌ పోఖ్రియాల్‌ నిషాంక్‌కు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పగ్గాలు దక్కే అవకాశం ఉంది. నితిన్‌ గడ్కరీ, నిర్మలా సీతారామన్‌, రాంవిలాస్‌ పాసవాన్‌, రవిశంకర్‌ ప్రసాద్‌, హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌కు పాత శాఖలనే కొనసాగించవచ్చు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/